Tuesday, September 14, 2010

తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ




తెలిమంచు  కరిగింది  తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు  వణికింది  పిలుపునీయనా ప్రభూ
తెలిమంచు  కరిగింది  తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు  వణికింది  పిలుపునీయనా ప్రభూ

నీ  దోవ  పొడవునా కువకువలా స్వాగతము
నీ  కాలి  అలికిడికి  మెలకువలా  వందనము
తెలిమంచు  కరిగింది  తలుపు తీయనా ప్రభూ...

ఈ  పూల  రాగాల పులకింత  గమకాలు
గారాబు  కవనాల  గాలి  సంగతులు
ఈ  పూల  రాగాల పులకింత  గమకాలు
గారాబు  కవనాల  గాలి  సంగతులు
నీ  చరణ  కిరణాలు  పలుకరించినా చాలు
పల్లవించును  ప్రభూ  పవళించు  భువనాలు
భానుమూర్తి... నీ  ప్రాణకీర్తన విని
పలుకని  ప్రణతులని ప్రణవశృతిని 
పాడనీ  ప్రకృతినీ  ప్రధమ  కృతినీ
తెలిమంచు  కరిగింది  తలుపు తీయనా ప్రభూ...

భూపాల  నీ  మ్రోల  ఈ  బేల  గానాలు
నీ  రాజసానికవి  నీరాజనాలు
భూపాల  నీ  మ్రోల  ఈ  బేల  గానాలు
నీ  రాజసానికవి  నీరాజనాలు
పసరు  పవనాలలో పసికూన రాగాలు
పసిడి  కిరణాల  పడి పదునుదేరిన  చాలు
తలయుచు  తలిరాకు  బహుపరాకు  విని  
దొరలని  దోరనగవు దొంతరని
తరలని దారి తొలగి  రాతిరిని 
తెలిమంచు  కరిగింది  తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు  వణికింది  పిలుపునీయనా ప్రభూ

నీ  దోవ  పొడవునా కువకువలా స్వాగతము
నీ  కాలి  అలికిడికి  మెలకువలా  వందనము
తెలిమంచు  కరిగింది  తలుపు తీయనా ప్రభూ...

No comments:

Post a Comment