పల్లవి :
ఏ చోట వున్నా వున్నా ఆ.. నీ వెంట లేనా లేనా ఆ..
సముద్రమంతా నా కన్నులలో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిటూర్పు సెగలౌతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా ఆ ఆ ఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు వుంది నిరంతరం నా మౌనం
ఏ చోట వున్నా ఆ.. నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నులలో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిటూర్పు సెగలౌతుంటే
చరణం :
నేల వైపు చూసే నేరం చేసావని ... నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని... తల్లి తీగ బంధిస్తుందా మల్లెపువ్వుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం..
ఇకనైనా చాలించమ్మా వేధించటం..
చెలిమై కురిసే సిరి వెన్నెలవా క్షణమై కరిగే కలవా ఆ ఆ అ.....
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు వుంది ప్రతీక్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా ఆ ఆ ఆ..
చరణం :
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా ... నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా ... కంటి పాప కోరే స్వప్నం చూపేదెలా
నా క్కూడా చోటేలేని నా మనసులో ... నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా ఆ ఆ ఆ ....
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు వుంది ప్రతీక్షణం నా మౌనం
ఏ చోట వున్నా ఆ ఆ... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నులలో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిటూర్పు సెగలౌతుంటే
http://www.youtube.com/watch?v=xF5GQxcTbh8
No comments:
Post a Comment