Thursday, June 9, 2011

తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకా

పల్లవి:
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకా
దూరంగ పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్క
ఇంకా నా చాలింక ఇంతేగ నీ రెక్క
యెగిరేన ఎప్పటికైన ఆకాశం దాకా
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకా

చరణం:
దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తునాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందె చిట్క నాకు నేర్పిస్తె చక్క
సూర్యుణ్నె కరిగిస్తాగ చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపొయాడుగ
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకా

చరణం:
ఆ కొంగలు యెగిరి యెగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చే దారిని యెపుడు మరిచిపోవెలా
ఓ సారటువైపెలుతుంది మళ్ళి ఇటు వైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాలేదా
కూ కూ బండి మా ఊరుంది
ఉండిపోవె మాతో పాటుగా

తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకా
దూరంగ పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా 

No comments:

Post a Comment