Tuesday, June 21, 2011

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

ఒక  దేవత వెలసింది నా కోసమే  ఈ ముంగిట నిలిచింది మధుమాసమే 
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా   సౌందర్యాలే  చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ  నాతో అంది ఇలా  నిన్నే ప్రేమిస్తానని    
ఒక  దేవత వెలసింది నా కోసమే  ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

విరిసే వెన్నెల్లోనా, మెరిసే కన్నుల్లోనా నీ నీడే చూశానమ్మా 
ఎనిమిది దిక్కులలోన  ముంగిలి చుక్కల్లోనా నీ జాడే వెతికానమ్మా  
నీ నవ్వే  నా మదిలో అమృతవర్షం  ఒదిగింది  నీలోనే అందని స్వర్గం 
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మునుముందుకు వచ్చేనే  చెలినే చూసి  
అంటుందమ్మా నా మనసే  నిన్నే ప్రేమిస్తానని                                                   
ఒక  దేవత వెలసింది నా కోసమే  ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

రోజా మొక్కను నాటి ప్రాణం నీరుగా పోసి  పూయించా నీ జడ కోసం  
రోజూ ఉపవాసంగా, హృదయం నైవేద్యంగా  పూజించా నీ జత కోసం
నీరెండకు నీవెంటే  నీడై వచ్చి  మమతలతో  నీగుడిలో ప్రమిదలు చేస్తా 
ఊపిరితో నీ రూపం  అభిషేకించి  ఆశలతో నీ వలపుకు హారతులిస్తా 
ఇన్నాళ్ళూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని        
   
ఒక  దేవత వెలసింది నా కోసమే  ఈ ముంగిట నిలిచింది మధుమాసమే 
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా   సౌందర్యాలే  చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ  నాతో అంది ఇలా  నిన్నే ప్రేమిస్తానని    

No comments:

Post a Comment