చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు
చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ
చరణం:
గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదీ నాది
తలపులు వేరైనా కలవని పేరైనా బలపడి పోతుందే ఉండే కొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకే వెళుతున్నట్టు
తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు
చరణం:
నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు |
|
|
No comments:
Post a Comment