Monday, June 27, 2011

పట్టు పట్టు పరువాల పట్టు కట్టు కట్టు సొగసైన కట్టు

ఒట్టు ఒట్టు యదపైన ఒట్టు   చుట్టు చుట్టు చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా  చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా   నను పలుచన చేయకురా

యదే నదై తరించదా నీ మాటలు వింటే  రతి మతి చెలించదా నీ రూపము కంటే
ఒంపు సొంపు అందించుకుంటా  ముద్దు ముచ్చటే పంచుకుంటా
తనువై నిన్ను పెనవేసుకుంటా  నాలో నిన్ను దాచేసుకుంటా (2)
విరహపు సొద వినలేవా దేవా  సొగసరి సొగసులు నీవే నీవే రావా
సుందరుడా నిను వలచితిరా  చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా  నను పలుచన చేయకురా

అనుక్షణం తపించవా నిను చూడని కళ్ళూ  ప్రతీక్షణం భరించునా వసివాడిన ఒళ్ళూ
మనసై నిన్ను కోరింది అందం  మత్తే హత్తుకోమంది మంచం
ముద్దే నన్ను మురిపించ నిత్యం  నీకై వేచిఉంటాను సత్యం (2)
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావా
సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరుచిలకనురా నను పలుచన చేయకురా
పట్టు పట్టు పరువాల పట్టు  కట్టు కట్టు సొగసైన కట్టు
ఒట్టు ఒట్టు యదపైన ఒట్టు  చుట్టు చుట్టు చీరల్లే చుట్టు

No comments:

Post a Comment