Tuesday, June 21, 2011

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా

ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపీ హ్యాపీ ఓ .. ఓ

తెలియకడుగుతున్నాలే కంప్యూటర్  ఏమంటోందీ పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైందీ
బోధపడని కంప్యూటర్  బదులన్నదే లేదందీ విసుగురాని నా మనసే ఎదురే చూస్తోందీ
ప్రేమ కథలు ఎప్పుడైన ఒక్కటే బ్రాండ్  ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టు డేటు ఫ్రెండు మాది తోటల్ చేంజ్  పాత నీతులింక మాకు నో   ఎక్స్చేంజ్
ఫ్రెండు లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే
కలను వదిలి ఇలను తెలిసి నడుచుకొ    హ్యాపీ  హ్యాపీ  ఆ..ఆ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా

నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా  తలచుకొంటె ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే  టైంవేస్టురా ఈ ధీమా  ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా
రోజనబ్బురమ్మంటున్న రోజు కదా   తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
లవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా   చూడకుండ చేయి వేస్తె ముప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా   లక్ష్యమందకుండ లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకద   హ్యాపీ హ్యాపీ  ఆ .. ఆ

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపీ హ్యాపీ  ఓ .. ఓ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా

No comments:

Post a Comment