Friday, June 10, 2011

నా మనసుకి ప్రాణం పోసీ .. నీ మనసును కానుక చేసీ

పల్లవి:
నా మనసుకి ప్రాణం పోసీ .. నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ .. ఓ ఓ ఓ ఓ ఓ ఒహొ హొ ఓ ఓ ఓ ఓ
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి .. ఓ ఓ ఓ ఓ ఓ
నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముందే పరచి ఉన్నావు లోకం మరిచి
నా మనసుకి ప్రాణం పోసీ .. నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ ఒహొ హొ ఓ ఓ ఓ ఓ
చరణం:
నీ చూపుకి సూర్యుడు చలువాయే నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పువులాయే నీ కులుకికి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి
నా మనసునె ఒక సరసలో అలజడులే సృష్టించావే
నా మనసుకి ప్రాణం పోసీ .. నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ .. ఓ ఓ ఓ ఓ ఓ ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

చరణం:
ఒక మాట ప్రేమగ పలకాలే ఒక అడుగు జత పడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో... ప్రతి జన్మకు  పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే ఎద పైన నిదుర పోవాలే
తీయ తీయని నీ స్మృతులతో... బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలే నీ ఆత్రుత గుర్తించాలే
ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే

No comments:

Post a Comment