Tuesday, June 21, 2011

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని


ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని


కనులకు తెలియని ఇదివరకెరుగని చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని


కవితలు చాలని సరిగమ లెరుగని  ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
 
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం

No comments:

Post a Comment