Tuesday, July 5, 2011

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం


కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా   ప్రేమ     ప్రేమ     ప్రేమ     ప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం


నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక   కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా  రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ    ప్రేమ     ప్రేమ     ప్రేమ
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

కంట తడి నాడూ నేడూ చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ     ప్రేమ     ప్రేమ     ప్రేమ  
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా   ప్రేమ     ప్రేమ     ప్రేమ     ప్రేమ

2 comments:

  1. సిరివెన్నెల గారి కలం నుండి జాలువారిన ఒక అద్భుతం..keep humming these lines when ever i miss my wife..

    ReplyDelete
  2. ఐ లవ్ దిస్ సాంగ

    ReplyDelete