Wednesday, July 6, 2011

ఓం నమహా నయన శృతులకు


ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు  ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో
 
రేగిన కోరికలతో గాలులు వీచగా    జీవన వేణువులలో మొహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా   కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ   ముద్దుల సద్దుకే నిదురలేచే ప్రణయగీతికి ఓం
 
ఒంటరి బాటసారి జంటకు చేరగా    కంటికి పాపవైతే రెప్పగా మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా   అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే  జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం 
 
ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

No comments:

Post a Comment