Wednesday, July 6, 2011

పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది


చెంపకు చుక్కను పెట్టి  పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదిట దిద్ది  ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో
పల్లకిలో.. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజు గారికి చిరునవ్వోచ్చే  

ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిదిగా వచ్చే
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది 


మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా  బంగరు బొమ్మా బంగరు బొమ్మా
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా  వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా

పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట  ఏటవమ్మా  మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో మాటలరాని బొమ్మలమయ్యాము 

మాటలరాని బొమ్మలమయ్యాము
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది



నా పెళ్ళిలో అతిధులు మేరే కదా   అతిధులు అంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది  నాపై మీ చల్లన చూపే వరముల వరదైయింది
ఈ అతిది దేవుడు  దేవున్నే కోరేది  సౌక్యంగా నువ్వుండాలని నీ బ్రతుకంతా బాగుండాలని
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వుంది మహారాణిలా వుంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజు గారికి చిరునవ్వోచ్చే  

ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిదిగా వచ్చే

No comments:

Post a Comment