Friday, July 1, 2011

పరువం వానగా నేడు కురిసేను లే

పరువం వానగా నేడు కురిసేనులే  ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే   ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే 

నదినే నీవైతే అల నేనే  ఒక పాటా నీవైతే నీ రాగం నేనే

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలని నీ గుండెలో నిండని
నీ నీడలా వెంటసాగని నీ కళ్ళల్లో కొలువుండని
పరువం వానగా నేడు కురిసేనులే  ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే  ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే  ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగ బంధాల చాటులో నీ పరువాలు పలికించుకో

1 comment: