ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా నీ కోసం ఆలోచిస్తూ ఏదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాసంతం .. అవుతుందే నా సొంతం ఎదనిండా ఆనందం .. నన్నే నన్నే ముంచేస్తుందే
ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ మై లవ్
వస్తావో రావో అంటూ సందేహంలో నేనున్నానే
కనిపించీ మురిపించాక కంగారవుతున్నానే
నీ అందం పూలచెట్టు కాదా
నీ పెదవే తేనెబొట్టు కాదా
నీ వయసే మాగ్నెట్టులాగా .. నన్నే లాగుతుందే
నవ్వుల్లో సంధ్యారాగం .. ఈ రోజే వింటున్నా
ఎండల్లో శీతాకాలం .. నీవల్లేగా అనుకుంటున్నా
ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ మై లవ్
ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీ కోసం ఆలోచిస్తూ ఏదేదేదో అయిపోతున్నా
ఈ రోజే ఆకాశంలో హరివిల్లేదో కనిపించింది
తెలతెల్లని మబ్బుల్లోనా ఎంతో ముద్దొస్తోందే
ఆ చూపే టార్చ్ లైట్ కాదా
ఆ రూపం చాక్లెట్టు కాదా
తన చుట్టూ శాటిలైట్ లాగా .. మనసు తిరుగుతుందే
జాబిల్లే నేలకు వచ్చీ .. నా ముందే నిలిచిందా
అదృష్ఠం నన్నే మెచ్చీ .. నిన్నే నాకు అందించిందా
ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ మై లవ్
ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీ కోసం ఆలోచిస్తూ ఏదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాసంతం .. అవుతుందే నా సొంతం
ఎదనిండా ఆనందం .. నన్నే నన్నే ముంచేస్తుందే
ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ .. ఓహ్ మై లవ్ మై లవ్
No comments:
Post a Comment