కన్నుల్లో నీ రూపమే ....గుండెల్లో నీ ధ్యానమే ....
నా ఆశ నీ స్నేహమే ....నా శ్వాస నీ కోసమే ....
ఆ ఊసుని... తెలిపేందుకు.. నా బాష ఈ మౌనమే ...
కన్నుల్లో నీ రూపమే ....గుండెల్లో నీ ధ్యానమే ....
నా ఆశ నీ స్నేహమే ....నా శ్వాస నీ కోసమే ....
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా ...
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా......
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం ...
కన్నుల్లో నీ రూపమే ....గుండెల్లో నీ ధ్యానమే ....
నా ఆశ నీ స్నేహమే ....నా శ్వాస నీ కోసమే ....
అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుతున్నాను మదిలోని మాటేదని ....
తల వంచుకుని నేను తెగ ఎదురు చూసాను నీ తెగువ చూడాలని .....
చూస్తూనే రేయంత తెలవారిపోతుంది ఏమో ఎలా ఆపడం ..
కన్నుల్లో నీ రూపమే ....గుండెల్లో నీ ధ్యానమే ....
నా ఆశ నీ స్నేహమే ....నా శ్వాస నీ కోసమే ....
ఆ ఊసుని తెలిపేందుకు నా బాష ఈ మౌనమే ...
కన్నుల్లో నీ రూపమే ....గుండెల్లో నీ ధ్యానమే ....
నా ఆశ నీ స్నేహమే ....నా శ్వాస నీ కోసమే ....
No comments:
Post a Comment