నువు చూడూ చూడకపో
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
ప్రేమించూ మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంటా
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
ప్రేమించూ మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంటా
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
నువు తిట్టినా నీ నోటివెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువు కొట్టినా నా చెంపమీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసుపువ్వును అందించానూ
కొప్పులో నిలుపుకుంటావో కాలికింద నలిపేస్తావో,
వలపు గువ్వనూ పంపించానూ
బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావో…
ఏంచేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా ...
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
నువు కొట్టినా నా చెంపమీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసుపువ్వును అందించానూ
కొప్పులో నిలుపుకుంటావో కాలికింద నలిపేస్తావో,
వలపు గువ్వనూ పంపించానూ
బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావో…
ఏంచేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా ...
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
పూజించడం పూజారివంతు
వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించడం ప్రేమికుడి వంతు
కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో
చిన్ని మనసుకే తెలియదుగా నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నావో
ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా ...
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాదిస్తా
వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించడం ప్రేమికుడి వంతు
కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో
చిన్ని మనసుకే తెలియదుగా నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నావో
ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా ...
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాదిస్తా
నిను చూడాలని ఉన్నా
నిను చూడాలని ఉన్నా నే చూడలేకున్నా
మాట్టాడాలని ఉన్నా మాట్టాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోన నాలోన కన్నీరవుతున్నా
అ అ అ … అ అ అ
నిను చూడాలని ఉన్నా నే చూడలేకున్నా
మాట్టాడాలని ఉన్నా మాట్టాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోన నాలోన కన్నీరవుతున్నా
అ అ అ … అ అ అ
No comments:
Post a Comment