Monday, June 6, 2011

డూ లవ్ మధరిండియా యూ టూ లవ్ ఇండియా


డూ యూ హియర్ మీ?  యా ...
లేడీస్ అండ్ జంటిల్మేన్   డూ యూ లవ్ మీ?   యా ...
డూ యూ లవ్ యువర్ మమ్మీ అండ్ డాడీ?
వైనాట్?  సో దట్
డూ లవ్ మధరిండియా    యూ టూ లవ్ ఇండియా
డూ లవ్ మధరిండియా    యూ టూ లవ్ ఇండియా

జననీ జన్మభూమినీ   స్వర్గమన్నదో కవికులం
ఏదీ అది ఎక్కడో   వెతకమంటుంది గురుకులం
గుండెపిండుకుని  తాగిన  గుక్కెడు పాలగురుతులేనప్పుడు
పోత పాల సీసాలకోసమే  పరుగులాటలే ఎపుడూ
సో దట్ వాట్ యూ సే?
ఐ లవ్ మై ఇండియా   లవ్లీ మదరిండియా
యూ టూ లవ్ ఇండియా  డూ లవ్ మదరిండియా

ఆకాశంలో ఆ సూర్యుడొక్కడే   అభ్యుదయంలో నాదేశమొక్కటే
ఆ సూర్యుడెప్పుడూ తూర్పు దిక్కునే ఎంచుకు పుడతాడు
కళ్యాణ తిలకమై కన్నతల్లి   ఒడిలోనే ఉంటాడు
అలాంటిదేరా నా భారతదేశం   సనాతనంలో సమిష్టిదేశం
ఆ సనాతనం తన పునాదిలోనే  సంకరమవుతుంటే
ఆ అభ్యుదయానికి సభ్యసమాజమే  సమాధి కడుతుంటే
తరతరాల ధాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి బిక్షకు పరుగులూ తగునా
ఐ లవ్ మై ఇండియా  లవ్లీ మదరిండియా
యూ టూ లవ్ ఇండియా  డూ లవ్ మదరిండియా

పరాయి దేశంలో కిరాయి కోసమని  స్వదేశ జ్ఞానం సమాధి కడుతుంటే
ఆ కూలి డబ్బు డాలర్లలోనె సుఖజీవనముందంటే
ఆ  పాలెకాపు నీ పాలి శత్రువై  తిరిగి వెళ్ళమంటే
కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై  కన్న తండ్రికే అది మూగ వేదనై
ఆ నారు పోసి నీరెట్టినోళ్ళకు  ఫలితం ఏముంది
ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు  ప్రతిష్ట ఏముంది
ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి
దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా
ధర్మమా? 
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా
ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా

No comments:

Post a Comment