Tuesday, July 19, 2011

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం .. ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం  ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం  గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం

ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినిగురులతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో  ఆలోచిస్తే అతిశయమే

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం

అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చె నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లాడే పువ్వా నువు ఎనిమిదొవ అతిశయమూ
నింగి లాంటి నీ కాళ్ళూ పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరు అధరాలు అతిశయమూ
మగువా చేతి వేళ్ళు అతిశయమే  మకుటాల్లాంటి  గోళ్ళు అతిశయమే  కదిలే ఒంపులు అతిశయమే

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం

No comments:

Post a Comment