Tuesday, July 19, 2011

ఓ ప్రేమ నా ప్రేమ

ఓ ప్రేమ నా ప్రేమ
ప్రేమే నాకు దైవం   నీవే నాకు ప్రాణం
ఓ ప్రేమ నా ప్రేమ    నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం    నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం    రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమ నా ప్రేమ   నా పాటే వినరావా

గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమ
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు బిగువులు తెలుసుకో ప్రియతమ
విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా
నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమ నా ప్రేమ  నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం  నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం  రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమ నా ప్రేమ  నా పాటే వినరావా

No comments:

Post a Comment