Tuesday, July 19, 2011

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు


ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

సిరిగల చిలకలు ఇల దిగి నడుచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలి మర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిళ్ళు పొదరిల్లు    ఇలలో ఉన్న హరివిల్లు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు  వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం  ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నేవున్నా  మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు   తెలుగింటమ్మ తిరునాళ్ళు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు  వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం  ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

1 comment:

  1. Titanium Burns Point (The Perfect Balance of Potatoes)
    The "Potato titanium 3d printer Burns Point" recipe uses the dried carrot, dental implants onions, salt, habanero peppers, black titanium wedding band onion, and the carrots. 2018 ford fusion energi titanium They use only 2020 ford edge titanium for sale on the white  Rating: 4.3 · ‎10 reviews

    ReplyDelete