Thursday, July 14, 2011

జాబిలికి వెన్నలకి పుట్టిన పున్నమిలే


జాబిలికి వెన్నలకి పుట్టిన పున్నమిలే  గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే  కంటి నిండా నిదరొయే చంటి పాడే జోలలోనే
జాబిలికి వెన్నలకి పుట్టిన పున్నమిలే  గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే


కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ 
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ

దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెన
బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన
మంచు కన్నా చల్లనైన మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా

No comments:

Post a Comment