Tuesday, July 12, 2011

పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం

కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం 

ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా   ఓ ఓ ఓ ఓ ఓ

తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ
లాలించు పాటలో
వీతంత తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా     ఇది తీరేదే కాదా…
 
పావురానికి పంజరానికి  పెళ్ళి చేసె పాడులోకం 
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా   ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి  పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం

తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం
నా తొలి నేరమున ఇది తీరని వేదననా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా    ఇక ఈ బాధే పోదా…

పావురానికి పంజరానికి  పెళ్ళి చేసె పాడులోకం

కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం 
ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
పావురానికి పంజరానికి  పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం

No comments:

Post a Comment