Tuesday, July 5, 2011

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హేహే హే హేహే హే హే హే

వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని
దూరమే చెప్పదే నీ రూపు మారిందని స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని
ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని  కొత్తగా తెలుసుకున్నాననీ ఈ ఇ ఇ ఇ

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక దిక్కులే వెదుకుతూ వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని
ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని విరహమే తెలుసుకోవాలని ఈ ఇ ఇ ఇ

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హే హే హేహే హే హేహే హే హే హే

No comments:

Post a Comment