ఓ ప్రియా ప్రియా.. నా ప్రియా ప్రియా..
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయే
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే

నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి క్రిష్ణ రాసలీలకి ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజుమహలు శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్నా యద మిన్న గెలిపించు ప్రేమనే కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైనా బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
ఆ అనారు ఆశకి తాజుమహలు శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధి కన్నా యద మిన్న గెలిపించు ప్రేమనే కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైనా బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి
నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం

No comments:
Post a Comment