Wednesday, July 6, 2011

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ


ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ  రాలేటి పూలా రాగాలతో

శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివి భువి కలా నిజం స్పౄశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని
ఆమని పాడవే హాయిగా

No comments:

Post a Comment