Friday, July 1, 2011

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు


ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు  వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో  ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్ ఓ మై లవ్ .. ఓ మై లవ్ ఓ మై లవ్ 

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు  వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో  ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్ ఓ మై లవ్ 



కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో   నీకోసం వేచాను పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై     నీకోసం నేనున్నా నీవాడినై
బాధే కదా ప్రేమంటే … ప్రేమే కదా నీవంటే … ఐనా తీపే తోడుంటే…
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు


చీకట్లో నేనుంటే ఓ నీడలా   వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే తేనీటిలో   తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమా ... నీ ప్రేమకే ఈ జన్మా...  నీవే నేనైపోతుంటే…

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్ ఓ మై లవ్ .. ఓ మై లవ్ ఓ మై లవ్

No comments:

Post a Comment